Share News

అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ‘షీట్స్‌’ తెరుస్తాం...

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:41 AM

మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు, మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై షీట్స్‌ తెరచి కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ జి విజయ్‌కుమార్‌ హెచ్చరించారు.

అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ‘షీట్స్‌’ తెరుస్తాం...
మాట్లాడుతున్న రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, పక్కన సీఐ బిల్ల కోటేశ్వర్‌

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు, మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై షీట్స్‌ తెరచి కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ జి విజయ్‌కుమార్‌ హెచ్చరించారు. మంగళవారం రాత్రి బావుపేటలో పోలీస్‌ కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా గ్రామప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్థులకు సూచించారు. కార్యక్రమంలో కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్‌, ఎస్‌ఐ సాంబమూర్తి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 12:41 AM