Share News

చేనేత కార్మికులను ఇబ్బందులు పెడితే సహించం

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:46 PM

చేనేద కార్మికులను ఇబ్బందులు పెడితే సహించేదిలేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం గంగాధర మండలం గర్షకుర్తిలో ఇటీవల విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసిన పవర్‌ లూమ్స్‌ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు.

చేనేత కార్మికులను ఇబ్బందులు పెడితే సహించం
స్వశక్తి చీరను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): చేనేద కార్మికులను ఇబ్బందులు పెడితే సహించేదిలేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం గంగాధర మండలం గర్షకుర్తిలో ఇటీవల విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసిన పవర్‌ లూమ్స్‌ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. అధికారులు కేసులు నమోదు చేసిన కార్మికులతో మాట్లాడి ఆందోళన చెద్దవద్దని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా చేనేత జౌళిశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెన్నయ్‌ విజిలెన్స్‌ ఆండ్‌ ఎన్ప్‌ర్స్‌మెంట్‌ అధికారులను గర్షకుర్తికి అనుమతించవద్దని కోరారు. విజిలెన్స్‌ అధికారులు కార్మికులపై నమోదు చేసిన కేసులను రద్దు చేయించి, సీజ్‌ చేసిన మగ్గాలను తిరిగి తెరిపిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు.

ఫ పేదకుటుంబానికి రూ. 50 వేల చెక్కు అందజేత

గర్షకుర్తి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కొట్టపల్లి స్రవంతి క్యాన్సర్‌ వ్యాధితో బాదపడుతూ ఇటీవల మృతి చెందింది. మృతురాలికుటుంబ పరిస్థితిని సామాజిక మాద్యామాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్రవంతి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రూపాయల చెక్కు మంజూరు చేయగా బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రజిత, ఎంపీడీవో రాము, సింగిల్‌ విండో అధ్యక్షుడువెలిచాల తిరుమల్‌రావు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ తోట కరుణాకర్‌, సింగిల్‌ విండో ఉపాధ్యక్షుడు వేముల భాస్కర్‌, పురమల్ల మనోహర్‌, శ్రీనివాస్‌రెడ్డి,చక్రపాణి, చందు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:46 PM