అమరవీరుల స్పూర్తితో ఉద్యమిస్తాం
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:43 PM
సాయుధ పోరాట వీరుల అమరవీరుల స్పూర్తితో ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు.
భగత్‌నగర్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): సాయుధ పోరాట వీరుల అమరవీరుల స్పూర్తితో ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. బుధవారం సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా నగరంలో బస్టాండ్ నుంచి అనభేరి విగ్రహం వరకు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ వీరోచిత పోరాటం చేసింది కమ్యునిస్టు పార్టీ అన్నారు. పోరాటంలో ఏలాంటి సంబంధం లేని బీజేపీ చరిత్రను వక్రీకరిస్తు మతం రంగు పులుముతోందని విమర్శించారు. కార్యక్రమంలో వర్ణ వెంకటరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందులసత్యం, బీమా సాహేబ్, కోనేటి నాగమణి, సుంకరి సంపత్, గజ్జల శ్రీకాంత్ పాల్గొన్నారు.