Share News

గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపరుస్తాం

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:21 AM

గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపరుస్తానని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం అన్నారు.

గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపరుస్తాం
బస్సును ప్రారంభిస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కొడిమ్యాల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపరుస్తానని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం మండలంలోని నమిళికొండ గ్రామంలో ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. కరీంనగర్‌ నుంచి బయలుదేరిన బస్సు నమిళికొండ నుంచి శ్రీరాములపల్లి గ్రామం వరకు వరకు నడుస్తుందన్నారు. ప్రజల కోరిక మేరకు ఇదే బస్సును తిప్పయ్యపల్లి, నల్లగొండ గ్రామం వరకు నడిపించడానికి సంబంధిత అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ కరీంనగర్‌ డీఎం విజయమాధురి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణగౌడ్‌, కేంద్ర సహకార బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ మల్లికార్జునరెడ్డ్డి, టీపీసీసీ కార్యదర్శి మహిపాల్‌రెడ్డ్డి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శంకర్‌గౌడ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మల్లేశం, సర్పంచులు గడ్డం జీవనరెడ్డి, శాబొద్దీన, మల్యాల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన నరేందర్‌రెడ్డ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లేశంయాదవ్‌, నాగభూషణ్‌రెడ్డ్డి, రాజేందర్‌, శోభన, హుస్సేన, నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డ్డి, నమిళికొండ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ

కొడిమ్యాల మండలంలోని సూరంపేట సర్పంచగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అక్కెనపెల్లి గంగవ్వ చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజాప్రతినిధులు, ప్రజలు పార్టీలో చేరుతున్నారన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమ కోసం కాంగ్రెస్‌ పార్టీ పాటుపడుతుందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సర్పంచ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే సహకారంతో పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కొడిమ్యాల సింగిల్‌ విండో మాజీ చైర్మన రాజనర్సింగరావు, మండల పరిషత మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌, గ్రామనాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 12:21 AM