రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:20 AM
మొంథా తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షంతో నెలరాలిన పంటతో పాటు రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు.
- కలెక్టర్ సత్యప్రసాద్
కోరుట్ల రూరల్/భీమారం అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షంతో నెలరాలిన పంటతో పాటు రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కోరుట్ల మండలంలోని మోహన్‌రావుపేట, భీమారం మండల కేంద్రంతో పాటు మండలంలోని దేశాయిపేట గ్రామాల్లో తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను శుక్రవారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు వర్షానికి నేలకొరిగిన పంటలను పరిశీలించారు. వాతావరణ పరిస్థితులను దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పుకోవాలని, తడిసిన ధాన్యం అరబెట్టుకోవాలని సూచించారు. కేంద్రం నిర్వాహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ డీఎస్‌వో జితేందర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.