ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం
ABN , Publish Date - May 03 , 2025 | 12:26 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు గత బీఆర్‌ఎస్ పాలనలో ధాన్యం కొనుగోలు, ప్రజా పాలన లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు మధ్య తేడాను గమనించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, మే 2 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు గత బీఆర్‌ఎస్ పాలనలో ధాన్యం కొనుగోలు, ప్రజా పాలన లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు మధ్య తేడాను గమనించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగవంతంగా వడ్ల కొనుగోలు జరుగుతుందని, రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అన్నారు. రైతు సోదరులు వడ్ల కొనుగోలులో గత బిఆర్‌ఎస్ పాలనకు, కాంగ్రెస్ ప్రజా పాలనకు తేడా గమనించాలని కోరారు. సిరిసిల్ల జిల్లాలో యాసంగి మార్కెటింగ్ సీజన్ మే 1 నాటికి 2021-22లో 175 కొనుగోలు కేంద్రాల ద్వారా 233 మెట్రిక్ టన్నులు, 2022-23లో 229 కొనుగోలు కేంద్రాల ద్వారా 9 వేల 424 మెట్రిక్ టన్నులను గత ప్రభుత్వం కొనుగోలు చేస్తే, ప్రజా ప్రభు త్వం ఏర్పడిన తర్వాత 2023-24లో 220 కొనుగోలు కేంద్రాల ద్వారా 67 వేల 520 మెట్రిక్ టన్నులను, ప్రస్తుత సంవత్సరం 244 కొనుగోలు కేంద్రాల ద్వారా 72 వేల 484 మెట్రిక్ టన్నులను కొను గోలు చేశామని అన్నారు. మే 1 నాటికి గత ప్రభుత్వం కంటే ఎన్నో రెట్లు అధికంగా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా కొనుగోలు చేసిన ధాన్యంలో రైతులకు వడ్ల డబ్బులు సకాలంలో చెల్లిస్తు న్నామని తెలిపారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకుని వస్తే వెంటనే కొనుగోలు చేస్తున్నామని, నాణ్యత ప్రమా ణాలను పరీక్షించి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలుపై రాజకీయాల కోసం రైతులను అనవసర ఆందోళనలకు గురి చేయవద్దని, ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరు కూడా రాజకీయాల ఆకాంక్షల కోసం తప్పుడు ప్రచారాలు చేసే వారి మాటలు నమ్మవద్దని, ప్రతి రైతు వద్ద నుంచి ధాన్యం సేకరించి మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుం దని తెలిపారు. రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వం తాలు తప్ప పేరుతో రైతులను నిలువునా మోసం చేసిందన్నారు. సంచికి 44 కిలోలు తూకం వేశారని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, డైరెక్టర్లు అప్పాల నాగభూష ణం, కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రావు, మండల అధ్యక్షుడు ఫిరో జ్‌పాషా తదితరులు ఉన్నారు.