రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు పాటుపడాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:47 AM
రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల కు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా సమర్థవంతంగా పనిచేసి భారత దేశంలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టారన్నారు. గ్రామ పంచాయతీలకు నేరుగా ఢిల్లీ నుంచి నిధులు వచ్చేలా చేశారన్నారు. ప్ర పంచానికి యువత వెన్నుముకని ఆనాడే గుర్తించి యువతకు 18 సంవ త్సరాలకే ఓటుహక్కు కల్పించారన్నారు. ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడిందన్నారు. నేటి యువతరం ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జవహర్ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బాటలో రాహుల్‌గాంధీ నడు స్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, నాయకులు ధర్మపురి శ్రీనివాస్, దూది శ్రీనివాసరెడ్డి, బాలకృష్ణ, ఇందూరి మధు, మ్యాకల గణేశ్, సత్యనారాయణ రెడ్డి, పులి సత్తయ్య, పాల్గొన్నారు.