వీరనారి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:44 AM
వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా కోరారు.
సిరిసిల్ల కలెక్టరేట్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించ గా, కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీరనారి చాక లి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని తెలంగాణ పౌరుషాన్ని పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమస్ఫూర్తిని చూపిన గొప్ప పోరాటయోధురాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.