మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషిచేయాలి
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:10 AM
మహాత్మా గాంధీ ఆశయ సాధన కు కృషిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. ధర్మపురి మండల కేంద్రంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ ఆశయ సాధన కు కృషిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. ధర్మపురి మండల కేంద్రంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీచౌక్ వద్ద ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పలువు రు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి చేసిన పోరాటాన్ని ఆయన కొనియాడారు. గాంధీ ఆశయసాధన కోసం కృషి చేసి గాంధీజీ అడుగు జాడల్లో నడవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ధర్మపురి ఆలయ
ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కూరగా యల సంతోష్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మామిళ్ల శ్రీనివాస్‌రావు, వర్తక సంఘం అధ్యక్షుడు అక్కెనపెల్లి రాజేందర్, కోశాధికారి రంగ శంకరయ్య, టీపీసీసీ సభ్యుడు, మండల కాం గ్రెస్ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సంగి సత్యమ్మ, మాజీ ఎంపీపీ సౌళ్ల భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల: మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతీ ఒక్కరు నెరవేర్చాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం పట్టణంలోని సమీకృత కలెక్ట రేట్ కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, కలెక్టరేట్ కార్యాలయ ఏవో హకీం, జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బోనగిరి నరేశ్, మెప్మా ఏవో దుర్గ పు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో...
పట్టణంలోని ఎస్సారెస్పీ క్యాంపులో గల జిల్లా పోలీసు ప్రధాన కార్యాల యంలో బాపూజీ చిత్రపటానికి ఎస్పీ అశోక్‌కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఆరిఫ్ అలీఖాన్, ఆర్‌ఐలు కిరణ్ కుమార్, సైదులు తదితరులు పాల్గొన్నా