Share News

డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి...

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:43 AM

యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చి దిద్దాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖ, శిశు సంక్షేమ శాఖ, వైద్య, తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి...

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చి దిద్దాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖ, శిశు సంక్షేమ శాఖ, వైద్య, తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్‌, ఎక్సైజ్‌, విద్యాధికారులు కలిసి రోడ్ల పక్కన పాఠశాలలు, పాన్‌ షాపుల్లో తనిఖీలు చేయాలన్నారు. విద్యార్థుల ప్రవర్తనను నిత్యం గమనించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలన్నారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, పైవ్రేటు హాస్టళ్లు, ఆర్టీసీ కార్గో, పైవ్రేట్‌ పార్సిల్‌ సంస్థలతోపాటు ఆన్‌లైన్‌ సంస్థలకు సంబంధించి గోదాములను తనిఖీ చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నశా ముక్త్‌భారత్‌ అభియాన్‌ క్యూ ఆర్‌ కోడ్‌ పోస్టర్‌ ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేష్‌బాబు, డీడబ్ల్యూవో సరస్వతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ ఆరోగ్యమహిళ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి

సుభాష్‌నగర్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్న పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పమేలాసత్పతి అన్నారు. మంగళవారం నగరంలోని సప్తగిరి కాలనీ అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య మహిళ పరీక్షల రికార్డులను పరిశీలించారు. బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తుల వివరాలను పక్కాగా నమోదు చేసి వారికి ప్రతినెల మందులు అందజేయాలని ఆదేశించారు. ప్రైవేటు మందుల షాపుల్లో లభించే అన్ని మందులను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందజేస్తారని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆరోగ్య మహిళ హెల్త్‌ క్యాంపులలో రీస్త్ర్కీనింగ్‌ పూర్తి చేయాలన్నారు. గర్భిణులకు క్రమం తప్పకుండా బరువు చూస్తు హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేయాలన్నారు.ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ వాహనంలో 2డి ఎకో, ఎక్స్‌రే, మమ్మోగ్రఫీ పరీక్షల తీరును కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యశాఖ ప్రోగ్రామ ఆఫీసర్‌ సనా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 12:43 AM