Share News

పాడి పశువులతో ఆర్థికంగా వృద్ధి చెందాలి..

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:50 AM

పాడి పశువులను సద్వినియోగం చేసుకుని పేద కుటుంబా లు ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆక్షాంక్షించారు.

పాడి పశువులతో ఆర్థికంగా వృద్ధి చెందాలి..

గంభీరావుపేట, ఆగస్టు 20 (ఆంద్రజ్యోతి) : పాడి పశువులను సద్వినియోగం చేసుకుని పేద కుటుంబా లు ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆక్షాంక్షించారు. గంభీరావుపేట మండలం దేశా యిపేట గ్రామంలోని ప్రగతిభవన్‌లో 17 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 చొప్పున 34 పాడి పశువు లను బుధవారం కలెక్టర్‌ పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ ప్రస్తుతం పంపిణీ చేసే పశువులు డెలివరీ తర్వాత 12 నుంచి 15లీటర్ల వరకు పాలు అందిస్తాయని లబ్ధిదారు లకు 2 పశువులను సబ్సిడీపై అందిస్తున్నామని, వీటిని వినియోగించుకుంటూ ఆర్థికంగా ప్రజలు ఎదగాలని, 2 పశువులను క్రమంగా 10 పశువుల స్థాయికి పెంచుకో వాలన్నారు. పశువులకు సంబంధించి డైట్‌ చార్జీ తెలు గులో తయారుచేసి లబ్ధిదారులకు అందించాలని పశు వైద్యాధికారిని ఆదేశించారు. భవిష్యత్‌లో ప్రతి మండ లంలో పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడు తామన్నారు. హర్యానా నుంచి వచ్చిన పశువులు స్థాని కంగా అలవాటు పడటానికి వారం రోజులు సమయం పడుతుందన్నారు. సబ్సిడీపై పంపిణీ చేసిన పశువు లను బయట అమ్మడానికి వీలు లేదని కలెక్టర్‌ సూచిం చారు. ప్రతి పశువుకు బీమా సౌకర్యం కూడా కల్పించా మన్నారు. పశువుల ద్వారా రోజు 2000 రూపాయల వరకు ఆదాయం లభిస్తుందన్నారు. హర్యానా పశువు లను తీసుకుని రావడంలో కృషి చేసిన వెటర్నరీ అధి కారులకు కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. వర్షాకా లంలో పచ్చి గడ్డి బాగా దొరుకుతుందని, వీటిని విని యోగించుకుని పశువులను మం చి ఆహారం అందించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నిధులు మంజూరు చేసిన పేద కుటుం బాలకు పశువులను పంపిణీ చేస్తున్నామన్నారు. గేదెలకు ఆరో గ్యపరంగా బీమా వైద్య సదుపా యాలు అందించేందుకు ప్రభు త్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ డెయిరీలకు లబ్ధిదారులు పాలు పోయాలని సూచించారు. పశువులను జాగ్రత్తగా చూసుకో వాలని లేగ దూడలకు పాలు కొంత వదిలి మిగిలినవి పిండుకోవాలని, లేగ దూడల పోషక లోపాలు రాకుండా చూసుకుంటే మంచి జరు గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమిరిశెట్టి విజయతిరుపతి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌ స్వప్న, పశువైద్యాధికారి అంజిరెడ్డి, లబ్ధిదారులు సంబం ధిత అధికారులు, రైతులు ఉన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:50 AM