Share News

బాల్య వివాహాలు లేని జిల్లాగా నిలపాలి

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:15 AM

బాల్య వివాహాలు లేని జిల్లాగా నిలిపేందుకు అధికా రులు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు ఎం చందన కోరారు.

బాల్య వివాహాలు లేని జిల్లాగా నిలపాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 13 ఆంధ్రజ్యోతి) : బాల్య వివాహాలు లేని జిల్లాగా నిలిపేందుకు అధికా రులు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు ఎం చందన కోరారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో కలిసి వివిధ శాఖ ల అధికారులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమి షన్‌ సభ్యురాలు చందన సమీక్షా సమావేశం నిర్వహిం చారు. మిషన్‌ వాత్సల్యలో భాగంగా బాల్యవివాహాలు, బాల కార్మికుల కేసులు, వారి హక్కుల పరిరక్షణ తీసు కుంటున్న చర్యలు, వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు ఎం చందన మాట్లాడారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిదేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పని చేయాలని పిలుపునిచ్చారు. బాల కార్మికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారిని సమీప విద్యాలయాల్లో చేర్ఫించాలని, అనాథ పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలను రెసిడెన్షియల్‌ స్కూళ్లలో జాయిన్‌ చేయా లని సూచించారు. విద్యాలయాలు, హాస్టల్‌లలో గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌, సైబర్‌ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై, హెల్ప్‌లైన్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులను విద్య ద్వారా సామాజికంగా, ఆర్థి కంగా రాణించేలా తీర్చి దిద్దాలని సూచించారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందించాలని, సేవలపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని, చిల్డ్రన్‌హోం పనులు పూర్తి చేయి స్తామని, పిల్లల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణకు చర్యలు తీ సుకుంటామన్నారు. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్‌ అంజయ్య, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డీవీహెచ్‌వో రవీందర్‌రెడ్డి, డీఈవో వినోద్‌ కుమార్‌, డీఎసీం చంద్రశేఖర్‌రెడ్డి, కార్మిక శాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌, జీసీడీవో పద్మజ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:15 AM