Share News

టీబీ రహిత గ్రామాల కోసం సహకరించాలి

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:31 PM

టీబీ రహిత గ్రామాల కోసం అందరూ సహకరించాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ మండల పరిషత్‌ సమావేశ మందిరంలో టీబీ చాంపియన్స్‌ శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు.

  టీబీ రహిత గ్రామాల కోసం సహకరించాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి

కరీంనగర్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): టీబీ రహిత గ్రామాల కోసం అందరూ సహకరించాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ మండల పరిషత్‌ సమావేశ మందిరంలో టీబీ చాంపియన్స్‌ శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ క్షయతో బాధపడే వారు జాగ్రత్తలు వహిస్తే ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందన్నారు. ప్రభుత్వం క్షయ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందని, లక్షణాలు ఉన్న వారు అశ్రద్ధ వహించకుడా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డిస్ర్టిక్ట్‌ ట్రైనింగ్‌ మేనేజర్‌ సురేందర్‌ మాట్లాడుతూ అందరూ టీబీ వ్యాధిపైన అవగాహన కలిగి ఉండాలని, మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. వ్యాధి నివారణలో అందరూ భాగస్వాములు కావడం ద్వారా దేశంలో టీబీ వ్యాధిని అంతమొందించవచ్చన్నారు. కార్యక్రమంలో ఇంపాక్ట్‌ ప్రాజెక్టు సిబ్బంది వనిత, పారిజాతం, శ్రీను, రాజుబోస్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 11:31 PM