Share News

సర్పంచ్‌ ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేయాలి

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:24 AM

సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ధైర్యం గా ధైర్యంగా పోటీ చేయాలని, రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభా కర్‌ అన్నారు.

సర్పంచ్‌ ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేయాలి

సిరిసిల్ల, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ధైర్యం గా ధైర్యంగా పోటీ చేయాలని, రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభా కర్‌ అన్నారు. ఆదివారం సిరిసిల్లలోని లహరి ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. అంతకుముందు సిరిసిల్ల చేనేత చౌక్‌ నుంచి మంత్రి పొన్నం ప్రభా కర్‌, రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాం గ్రెస్‌ నూతన అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌లను కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీతో స్వాగతించారు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జ్యోతిబా ఫూలే, చేనేత విగ్రహాలకు పూలమా లలు వేశారు. అనంతరం సంగీతం శ్రీనివాస్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రమాణస్వీ కారం చేయించారు. మండలాల నుంచి వచ్చిన నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాబోయే కాలంలో అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసే విధంగా అందరూ కలిసి పనిచేసే విధంగా జిల్లా అధ్యక్షుడు పని చేయాలని సూచించారు. గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ ధైర్యంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పు కోలేని పరిస్థితిని కాంగ్రెస్‌ ప్రజా పాలన ప్రభుత్వం కలగజేసిందని అన్నారు. మహిళ లకు ఉచిత బస్‌ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్‌, రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా సన్న వడ్లకు బోనస్‌ ఇస్తున్నామన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో గెలిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలవచ్చని అన్నారు. 2009లో ఎంపీగా గెలిచినప్పుడు ఐదు నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చిన సిరిసిల్లలో రాలేదని, అయినా ఇక్కడ జడ్పీటీసీ గెలిచామన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని, మానసిక బలహీనతను వీడాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజా పాలన ప్రభుత్వం అందిస్తుందన్నారు. 10 సంవత్సరాల్లో ఇవ్వని రేషన్‌ కార్డులు కాంగ్రెస్‌ ఇవ్వడమే కాకుండా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అందుకే గ్రామాల్లో బలంగా పని చేయాలన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పాలన్నారు. గతంలో పాలించిన వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ చేయలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, డబుల్‌ బెడ్రూం లు కట్టివ్వలేదని, వర్షాలు కురిసే నీళ్లు వస్తే కాళేశ్వరం నీళ్ళని అంటున్నారని అన్నారు. కాళేశ్వరం పాజెక్టు నుంచి నీళ్లు రాకపోయినా పంటలు పడ్డాయన్నారు. నాతో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌,ఆది శ్రీనివాస్‌, ఇతర ఎమ్మెల్యేలు ఉన్నామని జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసుకొని కాంగ్రెస్‌ జెండా ఎగరవేద్దామన్నారు. బలహీనంగా ఉన్నామనే భావన వదిలి బయటకు రావాలన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న వారికి నామినేట్‌ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరు గుతుందన్నారు. సిరిసిల్లకు ఎంతో చరిత్ర ఉందన్నారు సిరిసిల్ల నేత కార్మికులకు అండ గా ఉంటామన్నారు. నేత కార్మికులకు పని కల్పించడానికి మహిళా చీరలు అందించే ఆర్డర్‌ ఇవ్వడం జరిగిందన్నారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసామని, సిరిసిల్ల లో పాదయాత్ర నిర్వహించామని గుర్తుచేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు వి హను మంతరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం 1969లోనే మొదలైందన్నారు. దీక్ష దివస్‌ పేరుతో దీక్ష చేస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారన్నారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. నాంపల్లి దర్గా వద్ద అడుక్కునే వారన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ కార్యాలయ భవనాన్ని నిర్మించుకోవాలన్నారు. కార్యకర్తలు, నాయకులందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అందరిని కలుపుకొని ముందుకు పోవాలన్నారు. జిల్లా అధ్యక్ష పదవి కాలంలో తనకు సహకరించినందకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కార్యక్రమలో సంపూర్ణ మద్దతు ఇచ్చారని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగదని గెలిచిన రోజే చెప్పడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం జిల్లాను విస్మరించిందని, నేతన్నల బకాయిలను ప్రజా ప్రభుత్వం తీర్చిందని అన్నారు. రూ 325 కోట్లతో పనులు కల్పించామన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలన్నారు. ప్రజ లు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉన్నారన్నారు. 9వ ప్యాకెజ్‌ పనులు పూర్తి చేస్తామని, గతంలో మల్కాపేట రిజర్వాయర్‌ నుండి సుమారు 7 వేల ఎకరాలకు నీరు అందిం చామని అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనా రాయణ, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరూపరెడ్డి కాంగ్రెస్‌ నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, అంజన్‌ కుమార్‌, చీటి ఉమేష్‌ రావు, గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాస్‌, వనిత, శ్రీదేవి, చంద్రకళ, సూర దేవరాజు, గోలి వెంకటరమణ, సుధాకర్‌, వివిధ మండలాల అధ్యక్షులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు తది తరులు శ్రీనివాస సన్మానించారు.

Updated Date - Dec 01 , 2025 | 12:24 AM