Share News

పార్టీ పటిష్టానికి నిబద్ధతతో పని చేయాలి

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:58 AM

కాంగ్రెస్‌ పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు, యువత నిబద్ధతతో పని చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

పార్టీ పటిష్టానికి నిబద్ధతతో పని చేయాలి

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు, యువత నిబద్ధతతో పని చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పట్టణంలో నుంచి యువకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి పార్టీ కండవాలు వేసి శ్రీనివాస్‌ నాయ కులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాం గ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు ఆకర్షితులై యు వత కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. రానున్న రోజు లలో ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 12:59 AM