రాబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటాలి..
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:27 AM
గ్రాయపంచాయతీ ఎన్నికల స్ఫూర్తి తో జరుగబోయే జిల్లా, మండల పరిషత్, మున్సిపాల్టీల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రాయపంచాయతీ ఎన్నికల స్ఫూర్తి తో జరుగబోయే జిల్లా, మండల పరిషత్, మున్సిపాల్టీల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 32మంది సర్పంచ్‌లు, 30మంది ఉపసర్పంచ్‌లు, 200మంది వార్డుసభ్యు లను జిల్లా ఇన్‌చార్జి గంగిడి మోహన్ రెడ్డి సమక్షంలో జిల్లా అధ్యక్షుడు గోపి ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని గ్రామపంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ తరుపున సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారందరికి మద్దతులను ఇచ్చామన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఓడించేందుకు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేస్తున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం గట్టారని అన్నారు. ఇదే స్ఫూర్తితో జరుగబోయే జిల్లా, మండల పరిషత్, మున్సి పాల్టీల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుని వాటిపై కాషాయ జెండాలను ఎగురవేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రం మహేష్, మెరుగు హనుమంత్‌గౌడ్, కరీంనగర్ పార్లమెంటరీ కో-కన్వీనర్ అడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బండ మల్లేశం, బర్కం వెంకటలక్ష్మీ, బీజేవైఎం జిల్లా అధ్య క్షుడు రాగుల రాజిరెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి రాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నే హరీష, బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.