Share News

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి..

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:51 PM

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫ ల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపుని చ్చారు.

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి..

సిరిసిల్ల, అక్టోబరు3 (ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫ ల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపుని చ్చారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణా భవన్‌లో చొప్పదండి నియోజకవర్గం బోయినిపల్లి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రెండే ళ్లకే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్ని కల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్‌ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు. రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హామీలు నెరవేర్చలేక నిందలు..

ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్‌ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్‌ సర్కారు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజ లు కోరుకుంటున్నారని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్ర మించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీ లను, ఆరు గ్యారెంటీలను అమలుచేయలేకపోయిందని విమర్శించారు. యూరి యా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడు తోందని ధ్వజమెత్తారు. ఈ విష యాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షు డు కత్తెరపాక కొండయ్య, మాజీ జడ్పీటీసీ లచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ మాదవ్‌, డాక్టర్‌ అమిత్‌కుమార్‌, అను ముల భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2025 | 11:51 PM