కులగణన చేపట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
ABN , Publish Date - May 05 , 2025 | 12:21 AM
కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్య క్షుడు చొప్పదండి ప్రకాష్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, మే 4 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్య క్షుడు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండల మార్కెట్ యార్డు లు, ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనగోళ్లను ప్రారంభిం చామని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ధాన్యం కొనుగోళ్ళు చూసి బీజేపీ నాయకులు చూసి మాట్లాడాలని అన్నారు. కొనుగోళ్లు చేసి ధాన్యంకు రైతుల ఖాతాల్లో కూడా డబ్బు లు వేస్తున్నారన్నారు. అపారెల్ పార్కుతో పాటు అన్ని మండలాల్లో ధాన్యంతో గోదాములు నిండిపోతున్నాయని అన్నారు. రైస్ మిల్లకు కూడా ధాన్యం తరలించడం కూడా జరుగుతుందన్నారు. నిన్నటివరకు దాదాపు 75480 మెట్రి క్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారని అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్,నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ధాన్యం కొనగోళ్ళపై ఆరా తీస్తూ కలెక్టర్‌ను సంప్రదిస్తున్నారని అ న్నారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి భయపడి కులగణన చేపడుతామని కేంద్ర క్యాబినేట్ ప్రకటించిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కులగణన చేపట్టి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపిస్తే గవర్నర్‌కు ఆ మోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నా రు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షు డు ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యడు వంగ మల్లేశంగౌడ్, మార్కెట్ కమిటి డైరెక్టర్ దుబాల వెం కటేశం, నక్క నర్సయ్య, మాజీ కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ, వెంగళ లక్ష్మినర్సయ్య, సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ మాజీ డైరె క్టర్ నేరెళ్ళ శ్రీకాంత్‌గౌడ్, నాయకులు గడ్డం కిరణ్, అన్నల్ దాస్ భాను, బొద్దుల శ్రీనివాస్, ఎక్కల్‌దేది అంజనేయులు, ఎండీ అఫాన్, గౌతమ్, నారాయణ, యాదగిరి, చందన పాల్గొన్నారు.