Share News

మత సామరస్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలి

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:44 AM

మత సామ రస్యాలను నిలబెటేందుకు యువతీయువకులు ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్‌ కోరారు.

మత సామరస్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలి

సిరిసిల్ల రూరల్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : మత సామ రస్యాలను నిలబెటేందుకు యువతీయువకులు ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్‌ కోరారు. సిరిసిల్ల పట్టణంలో సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు రెండవ రోజు ఆదివారం నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరైన రవికుమా ర్‌ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ప్రా ణాలు అర్పించిన అమరవీరుల అశయాలను, ఆక్షాంక్షలను నిలబెట్టాలని కోరారు. కమ్యూని స్టుల పోరాటం మతం మీద కాదని, మతోన్మా దం మీద పోరాటం చేస్తుందన్నారు. మెజారిటీ మతోన్మాదం మైనార్టీ మతోన్మాదం రెండు ఒక టి కాదని, ఒకటి పరస్పరం పోషించుకుంటా యని, అవి రెండూ ప్రమాదమేనన్నారు. ఈ ఉన్మాదాలకు యువత దూరం ఉండాలన్నారు. వామపక్ష పార్టీలు మాత్రమే మత రాజకీయా లను దూరం పెట్టి అవకాశవాదానికి దూరంగా ఉంటున్నాయని అన్నారు. కాంగ్రెస్‌, బీఅర్‌ఎస్‌ పార్టీలు కూడా మతోన్మాదాన్ని వ్యతిరేకించి సూత్రబద్ధంగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యు లు కోడం రమణ, మాల్లారం అరుణ్‌కుమార్‌, విమల, మ ల్లారపు ప్రశాంత్‌, గురుజాల శ్రీధర్‌, రమేష్‌చంద్ర, సూరం పద్మ, గుర్రం అశోక్‌, రామంచ అశోక్‌, గిరిబాబు, నక్క దేవ దాస్‌, సిరిమల్ల సత్యం, ఎలిగేటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:44 AM