ఐక్యతతో హక్కులను సాధించుకోవాలి
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:56 AM
ఐక్యతతో హక్కులను సాధించుకోవాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్శ హన్మండ్లు పిలుపునిచ్చారు.
గంభీరావుపేట, అక్టోబరు 12 (ఆంద్రజ్యోతి): ఐక్యతతో హక్కులను సాధించుకోవాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్శ హన్మండ్లు పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సమరంలో ముదిరాజ్‌లు తమ సత్తా చాటాలని పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు పెరమల్లె లింగయ్య ఆధ్వర్యంలో ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పర్శ హన్మండ్లు మాట్లాడుతూ ముదిరాజ్‌లను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని అన్నారు. ముదిరాజులు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. ముదిరాజ్ సంఘం మం డల అధ్యక్షుడు శాత్రబోయిన లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షుడు శివంది దేవేందర్, జిల్లా కార్యదర్శి పెరిమెల్లి రమేష్, గౌరవ అద్యక్షుడు ఓరుగంటి నర్సింలు, మండల ఉపాధ్యక్షుడు ముచ్చ ఆనందం, మండల సంయుక్త కార్యదర్శి రంగు దేవయ్య, కోశాధికారి తోక దేవదాసు, సంఘ నాయకులు బాలరాజు, సంతోష్ తదితరులు ఉన్నారు.