విద్యార్థులకు బ్రాండెడ్ సైకిళ్లు అందజేస్తున్నాం..
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:45 AM
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తాము అందించే సైకిళ్లు బతుకమ్మ చీరల్లా ఉండవని, బ్రాండెడ్ సైకిళ్లను అందిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
వేములవాడ టౌన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యో తి) : ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తాము అందించే సైకిళ్లు బతుకమ్మ చీరల్లా ఉండవని, బ్రాండెడ్ సైకిళ్లను అందిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో మంగ ళవారం ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి చదివే విద్యార్థులకు మోదీ కానుక పేరుతో ఉచి తంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈసందర్భం గా ఏర్పాటుచేసిన సమావేశంలో బండి సంజ య్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 150రోజులు 1600కిలోమీటర్లు ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా పాదయాత్ర చేప ట్టారు. యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా ఓ గ్రామం తిరుగుతున్న సమయంలో ఓ బాలున్ని ఎం చదువుతున్నావని అడిగితే స్కూల్‌కు వెళ్ల డం లేదని, తన స్నేహితులకు అందరికి సైకిళ్లు ఉన్నాయని తనకు సైకిల్ లేదని చెప్పాడన్నారు. వెంటనే సైకిల్ కొనుగోలు చేసి అందజేయగా బాలుడు స్కూల్‌కు వెళుతున్నాడన్నారు. ప్రభు త్వ పాఠశాలలో విద్యనభ్యసించే పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్లు అందించాలని నిర్ణయించు కుని మోదీ కానుక పేరుతో సైకిళ్లు పంపిణీ చేస్తున్నాట్లు చెప్పారు. తాను ఎంపీగా పోటీ చేస్తే వేములవాడ నియోజకవర్గంలోనే ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. తాను శిశు మందిర్ స్కూల్లో చదివనాని, తనది పేద కు టుంబమే అనేక ఇబ్బందులను చూసానని, తన నాన్న కష్టంతో చదివించాడని గుర్తు చేసుకున్నా రు. పేద విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశ్యం తోనే సైకిళ్ల పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభు త్వ పాఠశాలలో చదువుకుంటారని, కొన్ని ప్రైవే టు పాఠశాలల్లో చదువుకొంటారని ఆరోపించా రు. తాను ప్రైవేటు స్కూళ్లకు వ్యతిరేకం కాదని తెలిపారు. గత ప్రభుత్వం విద్యా కోసం రూ. 68 వేల కోట్లు ఖర్చుచేస్తే వెదీ ప్రభుత్వం లక్ష కోట్లు కేటాయించిందన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని, విద్యార్థులు తలదించు కుని చదివుతే తల ఎత్తుకుని చూసే రోజులు వస్తాయని సూచించారు. తల్లిదండ్రులు పడు తున్న కష్టాలు ప్రతి విద్యార్థి కండ్లల్లో మెదలాల ని, తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు తెలిస్తేనే ఉన్నతంగా రాణించగలరన్నారు. ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ చదువుకునేందుకు అనేక కష్టాలు పడ్డారని, సమాజానికి భయపడకుండా ఒక లక్ష్యంతో పని చేశారని, హేళన చేసిన పట్టించుకోకుండా ముందుకు సాగిపోయి గొప్ప విద్యావంతుడుగా రాజ్యాంగాన్ని తయారుచేశార ని వివరించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, ఏఎస్పీ శాషాద్రినిరెడ్డి, ఆర్డీవో రాధాబాయి, బీజేపి జిల్లా అధ్యక్షుడు రెడ్డ వేని గోపి, రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ, వికాస్‌రావు తదితరులు ఉన్నారు.