కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:21 AM
కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా బుధవారం ఉదయం ఇరిగేషన్ అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిధిగా హజరై ఇరిగేషన్ ఎస్‌ఈ పెద్ది రమేష్‌తో కలిసి మీట నొక్కి దిగువకు నీటిని విడుదల చేశారు.
తిమ్మాపూర్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా బుధవారం ఉదయం ఇరిగేషన్ అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిధిగా హజరై ఇరిగేషన్ ఎస్‌ఈ పెద్ది రమేష్‌తో కలిసి మీట నొక్కి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో ఎమెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్‌ఎండీ కేపాసిటీ 920 ఫిట్లకు గాను 918.40ఫిట్ల నీటి నిల్వ ఉందని తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా ఉదయం వెయ్యి క్యూసెక్కుల నుంచి ప్రారంబించి సాయంత్రానికి మూడు వేల క్యూసెక్కులకు పెంచుతామని తెలిపారు. దిగువ మానేరు జలాశయం పఇధిలో కరీంనగర్ నుంచి సూర్యపేట వరకు ఏడు జిల్లాలు, 33 మండలాల పరిధిలో ఉన్న 8.99లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామని వివరించారు. స్టేజ్-1లో 5.1లక్షల ఏకరాలకు, స్టేజ్-2లో 3.98 ఎకరాలకు నీటిని అందిస్తామని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షం వల్ల ఆగస్టులోనే ఎల్‌ఎండీ పూర్తిగా నిండిందని, ఎగువ మానేరు, మధ్య మానేరులతోపాటు అన్ని ప్రాజెక్టులు నిండడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఈఈ సదయ్య, డిఈ శ్రీనివాస్, ఏఈఈ వంశీధర్, గీతిక, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
- ఎల్‌ఎండీ పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలకు ప్రస్తుతం 22.665 టీఎంసీల నీరు ఉంది. ఇన్‌ఫ్లో 3,721 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 3,305 క్యూసెక్కులు ఉంది.