ఒప్పందం ప్రకారం కూలి చెల్లించాలి
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:20 AM
మరమగ్గాల కార్మికులు, అసాములకు ఒప్పందం ప్రకారం కూలి పెంచి ఇవ్వాలని సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూ షం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాం డ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, జూన్ 25 (అంధ్రజ్యోతి) : మరమగ్గాల కార్మికులు, అసాములకు ఒప్పందం ప్రకారం కూలి పెంచి ఇవ్వాలని సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూ షం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాం డ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని పాలిస్టర్ ఉత్పత్తి దారుల అసోసియేషన్ భవనం ఎదుట బుధవారం యూనియన్ ఆధ్వర్యంలో ఆసాముల, కార్మికులకు కూలి పెంచి ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు. అనం తరం పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అడెపు భాస్కర్, అంకారపు రవిలకు వినతి పత్రాలను అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పాలిస్టర్ వస్త్రానికి మరమగ్గా ల కార్మికులు, అసాములకు సంవత్సరకాలంగా ఒప్పందం ప్రకారం కూలి చెల్లించకుండా కార్మికులు, ఆసాములను నష్టపరిచే విధంగా యాజమానులు వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా యజమాను ల ఒప్పందం ప్రకారం కూలి చెల్లించాలని లేకుంటే యజమానుల పై కార్మిక శాఖలో కేసులు నమోదు చేయించి నిరవధిక సమ్మెకు వెళ్తామన్నారు. స్పందించిన పాలిస్టర్ అసోసియేషన్ సభ్యులు రెం డురోజుల్లో యాజమానులు, కార్మికులతో చర్చలు జరిపి సమస్యల ను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అన్నల్‌దాస్ గణేష్, నక్క దేవదాస్, స్వర్గం శేఖర్, భాసశ్రీధర్, కందుకూరిరమేష్, ఎనగంటి సత్యం, ఎలగోండ దాసు, బింగి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.