పాలిస్టర్ వస్త్రానికి కూలి పెంచాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:43 AM
సిరిసిల్లలో తయారు చేసే పాలిస్టర్ వస్త్రానికి కూలిని 15 రోజుల్లో పెంచాలని లేకుంటే సమ్మె కు వెళుతామని సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ తెలిపారు.
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో తయారు చేసే పాలిస్టర్ వస్త్రానికి కూలిని 15 రోజుల్లో పెంచాలని లేకుంటే సమ్మె కు వెళుతామని సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని పాలిస్ట్రర్ అసో సియేషన్ సంఘ భవనంలో మంగ ళవారం అధ్యక్ష, కార్యదర్శులు అడెపు భాస్కర్, అంకారపు రవిలకు కార్మికులతో కలిసి కూలి పెంచాలంటూ వినతి పత్రాన్ని అందిం చారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ పాలిస్టర్ వస్త్రాన్ని తయారుచేస్తున్న మరమ గ్గాల కార్మికులు, అసాములు, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు 15 రోజుల్లో కూలి పెంచాలని లేకుంటే సమ్మె చేస్తామన్నా రు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అఽధ్యక్షు డు సిరిమల్ల సత్యం, ఉడుత రవి, వైపని వర్క ర్స్ యూనియన్ నాయకులు ఎలిగేటి శ్రీనివాస్, గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.