Share News

ఓటర్‌ జాబితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:52 PM

ఓటర్‌ జాబితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నిక ల సంఘం కమిషనర్‌ రాణికుముదిని ఆదేశించారు.

ఓటర్‌ జాబితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఓటర్‌ జాబితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నిక ల సంఘం కమిషనర్‌ రాణికుముదిని ఆదేశించారు. కలె క్టరేట్‌లో మంగళవారం టీపోల్‌ నుంచి ఓటర్‌ జాబితా డౌన్‌లోడ్‌ తదితర అంశాలపై ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో హైదరాబాద్‌నుంచి రాష్ట్ర ఎన్ని కల కమిషనర్‌ రాణికుముదిని సమీక్షించా రు. ఈ సందర్భంగా టీపోల్‌ నుంచి ఓటర్‌ జాబితాలను డౌన్‌లోడ్‌ ఎలా చేసుకోవాలి అనే విధానంపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటే షన్‌ ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో నోడల్‌ అధి కారులు సహాయం చేసేందుకు సిద్దంగా ఉంటారని తెలిపారు. ఓటర్‌ జాబితా డౌన్‌లోడ్‌ చేసుకుని వార్డుల వారీగా సిద్దం చేయాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలలోగా వార్డుల వారీగా డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ చేసేందుకు పనులు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, టీపీవోలు అన్సారీ, సాయికృష్ణ, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:52 PM