ఓటర్ జాబితా ఎస్‌ఐఆర్ కట్టుదిట్టంగా నిర్వహించాలి
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:49 AM
జిల్లాలో ఓటర్ జాబి తా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కట్టుదిట్టంగా నిర్వ హించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ జాబి తా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కట్టుదిట్టంగా నిర్వ హించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మంగళవా రం కలెక్టరేట్‌లో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్-2002పై అధికారుల తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ 2002 ఎస్‌ఐఆర్ ఓటర్ జాబితాతో తాజా ఓటరు జాబితా తో పరిశీలించి కామన్‌గా ఉన్న పేర్లు పక్కన పెట్టాలన్నారు. తదుపరి రోజులలో 2002 తర్వాత కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న ప్రతి ఓటరు వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుందన్నారు. గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధి, ప్రస్తుత పోలింగ్ కేంద్రాల పరిధి మ్యాచ్ చేసుకుంటూ ఓటరు జాబితా పరిశీ లన చేయాలని, ఈ ప్రక్రియను కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్ అంటామ న్నారు. వేములవాడ సంబంధించి కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్ పూర్తి చేసామని తెలిపారు. 2002లో జరిపిన ఎస్‌ఐఆర్ తరువాత ఓటు హక్కు సంక్రమించిన ప్రతిఒక్కరి వివరాలు ఎన్నికల కమిషన్ ఆదే శాల మేరకు ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. ఓటర్ జాబితాలో డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్ల తొలగింపునకు 20 నుంచి 25 సంవత్సరా లకు ఒకసారి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) చేయడం జరు గుతుందని, తెలంగాణలో 2002లో ఎస్‌ఐఆర్ చేశామన్నారు. 40 సంవ త్సరాల కంటే ఎక్కువ వయసున్న ఓటర్ల జాబితా పరిశీలన చేయా ల్సిన అవసరం ఉండదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రతి బూత్ పరి ధిలో మిగిలిన ప్రతి ఒక్క ఎంట్రీ క్షేత్రస్థాయిలో ధ్రువీకరణ చేసేలా చూడాలని అన్నారు. ఈనెల22లోపు పాత జాబితాతో సరిచూసుకుంటు ధ్రువీకరించాల్సిన ఓటర్ జాబితాను సమర్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో లు వెంకటేశ్వర్లు,రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.