పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:18 AM
గ్రామాల్లో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలుచేస్తూ శాంతిభద్రతల సమస్యలు తలెత్త కుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు.
తంగళ్లపల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలుచేస్తూ శాంతిభద్రతల సమస్యలు తలెత్త కుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తని ఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు, స్టేషన్‌కు సంబంధించిన పలు రికార్డుల ను తనిఖీ చేసి స్టేషన్ భౌగోళిక మ్యాప్ పరిశీలించారు. అనంతరం పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులను క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల స్థితి గుతులపై అడిగితెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లా డుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితు లకు సత్వరన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టి పెట్రోలింగ్ సమయంలో సిబ్బంది, అధికారులు తనిఖీ చేస్తూ వారి కదలికలను ఎప్పటికప్పు డు గమనించాలన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై నిఘా ఏర్పాటు చేసి సామాన్య ప్రజా నీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే తగిన కా ర్యాచరణ ప్రారంభించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో క్రిటి కల్, నాన్ క్రిటికల్ పోలీసంగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ పకడ్బందీగా అమలుచేయాలన్నారు. పోలీస్ స్టేష న్ పరిధిలోని ప్రజలకు యువతకు గజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదా ర్థాలపై నిఘా కఠినతరం చేసి వాటివల్ల కలిగే అనర్థాలపై, సైబర్ నేరా లనియంత్రణపై చైతన్యపరచాలని, ప్రతిరోజు వాహన తనిఖీలు, డ్రం కెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వెంట రూరల్ సీఐ మొగిలి, ఎస్‌ఐ ఉపేంద్రచారిలు ఉన్నారు.