అటవీ భూములు రక్షించాలని కదంతొక్కిన గ్రామస్థులు
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:10 AM
అటవీ భూములను రక్షించాలని, ఆక్రమణలను అరికట్టాలని మానాల గ్రామస్థులు ఉద్య మించారు.
రుద్రంగి, సెప్టెంబరు 23 (ఆంద్రజ్యోతి) : అటవీ భూములను రక్షించాలని, ఆక్రమణలను అరికట్టాలని మానాల గ్రామస్థులు ఉద్య మించారు. చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా తరలివెళ్లారు. నాలుగు రోజులు క్రితం వేల సంఖ్యలో నీలగిరి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరకడంతో శనివారం మానాల గ్రామంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టి ఫారెస్ట్ అధికారులను నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చెట్లు కొట్టిన వారిపై, సహకరించిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకుంటామని నాలుగు రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మంగళవారం చలో కలెక్టరేట్ తలపెట్టారు. ఈ క్రమంలో మానాల శివారులో పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయినా మానాల నుంచి రుద్రంగి వరకు సూమారు 500 మంది పాదయాత్రగా వెళ్లారు. ఎదుట ఎలాంటి గొడవలు, ఆందోళనలు చేయబోమని చెప్పడంతో పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో వివిధ వాహనాల్లో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.