Share News

గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 25 , 2025 | 12:46 AM

గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ లో హైదరాబాదు నుంచి సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఆదివారం జరిగే గ్రామ పాలన అధికారి పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చాలని, జిల్లాలో నోడల్‌ అధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటల వరకు జవాబు పత్రాలను, 9.20 గంటల వరకు ప్రశ్నా పత్రాలను తరలించాలని అన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సరిగ్గా సీల్‌ చేసి జేఎన్టీయూహెచ్‌కు అందించాలని, ఉపయోగించని జవాబు పత్రాలను కూడా తప్పనిసరిగా పరీక్ష కేంద్రా ల నుంచి సేకరించాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సీటింగ్‌ అరెంజ్‌ మెంట్‌లు పక్కాగా ఉండాలని, అభ్యర్థులకు అవసరమైన తాగు నీరు, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా వంటి సదుపాయాలు కల్పించాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన మేర ఇన్విజిలేటర్‌ నియ మించాలని, అభ్యర్ధులు ఏవిధమైన ఎలకా్ట్రనిక్‌, వాచీలు తీసుకురావద్దని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో మెడికల్‌ టీం ఏర్పాటు చేయాలని, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వ హణ చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల రూట్‌లలో బస్సు నడపా లని అన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ పక్కల జిరాక్స్‌ షాపులు మూసి వేయాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వరు,్ల గీతనగర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద, కలెక్టరేట్‌ ఏవో రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 12:46 AM