మానేరు రివర్ ఫ్రంట్ అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:09 AM
మానేరు రివర్ ఫ్రంట్ అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ శ్రేణులతో కలిసి ఆయన మానేరు రివర్ ఫ్రంట్ పనులను శనివారం పరిశీలించారు.
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి
భగత్‌నగర్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): మానేరు రివర్ ఫ్రంట్ అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ శ్రేణులతో కలిసి ఆయన మానేరు రివర్ ఫ్రంట్ పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రివర్‌ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి పనుల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన మానేరురివర్ ఫ్రంట్, తీగల వంతెన నిర్మాణ పనుల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంగుల కమలాకర్ నేతృత్వంలో జరిగిన పనులు పూర్తిగా అవినీతిమయమై లోపభూయిష్టంగా జరిగాయన్నారు. చెక్ డ్యాంలు నాణ్యత లోపంతో నిర్మించడంతో వర్షాలకు కొట్టుకు పోయాయన్నారు. తీగలవంతెన పనులను హడావుడిగా ప్రారంభించారన్నారు. ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. లేకపోతే సీపీఐ పక్షాన ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, కిన్నెర మల్లవ్వ, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, కసిరెడ్డి మణికంఠరెడ్డి, బండ రాజిరెడ్డి, కంది రవీందర్‌రెడ్డి, మచ్చ రమేష్, బ్రామండ్లపల్లి యుగేందర్, గామినేనని సత్తయ్య, నగునూరి రమేష్, కూనరవి, చెంచల మురళి, మామిడిపల్లి హేమంత్‌కుమార్, సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.