వేములవాడ పట్టణ సమగ్రాభివృద్ధి ధ్యేయం
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:01 AM
వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని 11, 12 వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పను లకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా నిధులతో వేములవాడ పురపాలక సంఘం పరిధి లోని 28 వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నా మని తెలిపారు. ఒకవైపు పట్టణ అభివృద్ధి మరోవైపు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామ న్నారు. గత పాలకులలాగా ఇచ్చిన మాట తప్పకుండా ఎన్నికల హామీ నెరవేర్చే విధంగా కార్యాచరణతో పని చేస్తున్నామన్నారు. మూలవాగుపై రెండో బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసి పది సంవత్సరాలు గడిచిన గత పాలకులు పట్టించుకోలేదని, బ్రిడ్జి నిర్వా సితులకు పరిహారం కూడా ఇవ్వలేదని అన్నారు. తాము అధికారం లోకి వచ్చాక బ్రిడ్జి నిర్వాసితులకు సైతం పరిహారం అందించామని, వర్షాకాలంలో బ్రిడ్జి నిర్మాణం మొదలుపెడితే సాంకేతికంగా ఇబ్బం దులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వేములవాడ పట్టణం తోట నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, తదిత రులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషిచేయాలని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడలో నిర్వ హించిన నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలవడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పాత్ర మరువలేనిదన్నారు. కార్యక్రమంలో సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జ మల్లేష్, జిల్లా కోకన్వీనర్ కనికరపు రాకేష్, వేముల వాడ పట్టణ కన్వీనర్ ఎర్ర శ్రావణ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు న్యాత నవీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు వరం.. సీఎంఆర్‌ఎఫ్ పథకం
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు గొప్ప వరమ ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ అర్బన్, రూరల్ మండలాల పరిధిలో అర్హులైన 72 మంది లబ్ధిదారులకు 24లక్షల 31వేల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కీలకమైన మెడికల్ హబ్‌గా మారిందన్నారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచి ప్రజా ఆరో గ్యభద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.