Share News

రాష్ట్రంలో వేములవాడకు ఓ ప్రత్యేకత ఉంది..

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:06 AM

రాష్ట్రంలోనే వేములవాడకు ఓ ప్రత్యేకత ఉందని, అంతలా తొమ్మిది రోజులు బతుకమ్మ పండగ జరుపుకుంటే ఇక్కడ ఏడు రోజుల్లో జరుపుకోవడ మే ప్రత్యేకత అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

రాష్ట్రంలో వేములవాడకు ఓ ప్రత్యేకత ఉంది..

వేములవాడ కల్చరల్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే వేములవాడకు ఓ ప్రత్యేకత ఉందని, అంతలా తొమ్మిది రోజులు బతుకమ్మ పండగ జరుపుకుంటే ఇక్కడ ఏడు రోజుల్లో జరుపుకోవడ మే ప్రత్యేకత అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేముల వాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా మున్సిపల్‌ కార్యాల యం నుంచి బతుకమ్మ తెప్ప వరకు గౌరమ్మ ఊరేగింపు నిర్వహించి తెప్పవద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీని వాస్‌ మాట్లాడుతూ మహిళలు సంబరంగా జరుపుకునే బతుకమ్మ పండగకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. వేములవాడలో ఆడపడుచులందరూ కలిసి ఆడుకునే పండగగా ప్రసిద్ధికెక్కిందన్నా రు. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకుందని గుర్తు చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ తమ కష్టసుఖాలను, ప్రేమ ఆప్యాయతలను పాటు రూపంలో మేళవించడం బతుకమ్మ పండగ ప్రత్యేక అన్నారు. రాష్ట్ర మహిళలకు, ప్రజలకు బతుకమ్మ శుభాకాం క్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 01:06 AM