Share News

వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:36 AM

జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే అనుమతించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి

రుద్రంగి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే అనుమతించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. రుద్రంగి మండల కేంద్రం శివారులోని రాజన్న సిరిసిల్ల - జగిత్యాల జిల్లాల సరిహద్దు చెక్‌పోస్టును ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ గురవారం తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే రుద్రంగిలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్‌ కేంద్రంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్ప్‌ డెస్క్‌, పోలీస్‌ బందోబస్తు తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అలాగే సరిపడా సిబ్బంది ఉన్నరా అని అడిగి తెలుసు కున్నారు. నోటీస్‌ బోర్డులపై నోటిఫికేషన్‌ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా నామినేషన్‌ ప్రక్రియ నిర్వహించాలని, నామినేషన్‌ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరా లను కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన ఎలాంటి సందేశాలు ఉన్నా పైఅధికారులను సంప్రదిం చాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డివో శేషాద్రి, తహసీల్దార్‌ పుప్ప లత, ఎంపీడీవో నటరాజ్‌, సీఐ వేంకటేశ్వర్లు తదితరులు పాల్గోన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:36 AM