వ్యాధి నిరోధక టీకా కేంద్రం తనిఖీ
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:19 AM
జిల్లా కేంద్రం సుందరయ్యన గర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత తనిఖీ చేశారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రం సుందరయ్యన గర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను, మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడారు. ఐదేళ్ల లోపు పిల్లలందరికి వ్యాధి నిరోధక టీకాలు షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల ని సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది ప్రతిరోజు సమయం పాలన పాటిస్తూ రోగులకు సేవలను అందించాలని సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్ర సిబ్బందితో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు.