ప్రభుత్వ వైద్యశాలల సేవలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:15 AM
ప్రభుత్వ వైద్యశాలల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. శుక్రవారం గంగాధర పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు.
- జిల్లా వైద్యాధికారి వైద్యాధికారి వెంకటరమణ
గంగాధర, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యశాలల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. శుక్రవారం గంగాధర పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్, అవుట్ పేషేంట్ రిజిస్టర్ ఇతర రికార్డులను పరిశీలించారు. వ్యాధిగ్రస్తుల వివరాలను పరిశీలించారు. అవుట్ పేషంట్లతో మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు. ఫార్మసీ స్టోర్లలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను పరిశీలించారు. పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్‌ఆర్‌ను దాని రోజువారి టెంపరేచర్ రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులలో మహిళల స్ర్కీనింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రసూతి గదిని పరిశీలించి అందులో ఉండాల్సిన అత్యవసర మందులను పరిశీలించారు. సాధారణ ప్రసవాలు జరిగేటట్లుగా ప్రోత్సహించాలన్నారు. ఆయన వెంట పీవో డాక్టర్ సనజవేరియా, వైద్యాధికారి శ్వేత సిబ్బంది పాల్గొన్నారు.