Share News

న్యాయ సహాయ కేంద్రాన్ని వినియోగించుకోవాలి

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:57 PM

న్యాయ సహాయ కేంద్రాన్ని బాధితులు వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె వెంకటేష్‌ అన్నారు.

న్యాయ సహాయ కేంద్రాన్ని వినియోగించుకోవాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె వెంకటేష్‌

సుభాష్‌నగర్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): న్యాయ సహాయ కేంద్రాన్ని బాధితులు వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె వెంకటేష్‌ అన్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో న్యాయ సహాయ కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ మాదకద్రవ్యాల బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయాన్ని అందించడానికి ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా న్యాయ సహాయ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కేంద్రంలో ఒక న్యాయవాది, ఒక పారా లీగల్‌ వలంటీర్‌ను నియమించినట్లు తెలిపారు. మద్యానికి, మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకోవద్దని ఆసుపత్రికి వచ్చిన రోగులకు తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డి, లీగల్‌ సెల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ తనుకు మహేశ్‌, మానసిక రోగుల విభాగ అధిపతి అజయ్‌కుమార్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ నవీన పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2025 | 11:57 PM