Share News

ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:49 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంటరమణ అన్నారు. శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బుధవారం తనిఖీ చేశారు.

ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలి

శంకరపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంటరమణ అన్నారు. శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది అటెండెన్స్‌ రిజిస్టర్‌, ఔట్‌ పేషెంట్‌ రిజిస్టర్‌తోపాటు ఇతర రికార్డులను పరిశీలించారు. ఎన్‌సీడీ క్లీనిక్‌లో అసంక్రమిత వ్యాధుల రికార్డులో అధిక రక్తపోటు, షుగర్‌ వ్యాధిగ్రస్తుల వివరాల నమోదును పరిశీలించి వారికి మందులను అందజేస్తున్న తీరును ఆరా తీశారు. ఔట్‌పేషెంట్లతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఫార్మసీ గదిలో సీజనల్‌ వ్యాధులకు సంబంధించి మందులను పరిశీలించారు. ఆరోగ్య మహిళ హెల్త్‌ క్యాంపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గదిని పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు మొలంగూర్‌ హెల్త్‌ సెంటర్‌లో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్లు శ్రావణ్‌కుమార్‌, శ్రావణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 11:49 PM