ఊరురా పూలజాతర..
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:02 AM
సంస్కృతి సంప్రాదాయలు ఉట్టిపడేలా అడపడుచులు అత్యంత ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగతో ఊరురా పూల జాతర మొదలైంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సంస్కృతి సంప్రాదాయలు ఉట్టిపడేలా అడపడుచులు అత్యంత ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగతో ఊరురా పూల జాతర మొదలైంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆదివారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఎంతో సందడిగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ పర్వం తొలిరోజు పూల పరిమళాలతో అడపడుచులు సందడి చేశారు. ప్రతి పల్లె నుంచి పట్టణందాకా ప్రతి గల్లీలోనూ మహిళల చప్పట్టు, గొంతుకల ఐక్యత బతుకమ్మ పాట లు గానంచేశాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేము లవాడ మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో తీరోక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆటపాటల వేడుకలు నేత్రప ర్వంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో తెలంగాణలోనే ప్రత్యేకంగా నిలిచిన బతుకమ్మ ఘాట్ వద్ద పురపాలకర సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మహిళల ను అకట్టుకున్నాయి. సిరిసిల్లలోని బీవైనగర్, గణేష్‌నగర్, తారకరామానగర్, వెంకంపేట, సర్దార్‌నగర్, అశోక్‌నగర్, పద్మనగర్, సంజీవ య్యనగర్, శాంతినగర్, అటోనగర్, సిద్ధార్థన గర్, రెడ్డివాడ, అంభేద్కర్‌నగర్, విద్యానగర్, సాయినగర్, గీతానగర్, శివనగర్, సుభాష్‌న గర్, నెహ్రూనగర్, గాంధీనగర్, గోపాల్‌నగర్, పెద్దబజార్, తదితర ప్రాంతాల్లో మహిళలు సామూహికంగా బతుకమ్మ ఆట పాటలతో సంబురంగా గడిపారు.