ముఖ్యమంత్రి, మంత్రివర్గం వల్లే యూరియా కష్టాలు..
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:47 PM
యూరియా కోసం రైతులు లైన్లో చెప్పులు పెట్టుకునే పరిస్థితులు ముఖ్యమంత్రి, మంత్రి వర్గం వల్లే వచ్చాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆగయ్య అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి) : యూరియా కోసం రైతులు లైన్లో చెప్పులు పెట్టుకునే పరిస్థితులు ముఖ్యమంత్రి, మంత్రి వర్గం వల్లే వచ్చాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆగయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావే శంలో ఆయన మాట్లా డారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇష్టం వచ్చినట్లుగా కేటీఆర్‌పై మాట్లాడడాన్ని బీఆర్‌ఎస్ పక్షాన ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రితో పనిచేస్తున్న వారందరు ఎలాంటి వారో ప్రజలంద రికీ తెలుసని అన్నారు. రైతుబంధు రూ.15వేలు ఇస్తామని రూ.12వేలు ఇచ్చారని, కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు.. చదువు కొనే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ముఖ్యమం త్రి మోసం చేశారన్నారు. రైతులకు సకాలంలో యూరియా, ఎరువులు ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం అని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి నీళ్లను, సమయానికి కరెంట్ ఇస్తూ, సకా లంలో ఎరువులు, యూరియా ఇచ్చి ధాన్యానికి మద్దతు ధరను చెల్లించి రైతుల ఖాతాల్లో డబ్బు లు వేసింది కేసీఆర్ పాలనలోనేనన్నారు. అనేక హామీలను ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, పేదల ఇళ్లను కూలగొ డుతున్నారని వారి ఆస్తులు, ప్రాణాలకు నష్టం చేకూర్చుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తం గా ఎక్కడచూసినా గురుకులాల్లో పురుగుల అన్నం తో కలుషితం అయిన ఆహారం తింటూ విద్యార్థు లు ఆసుపత్రి పాలవుతున్నారని, విద్యా వ్యవస్థను గాడిలో ముఖ్యమంత్రి పెట్టలేకపోతున్నాడని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్, మాజీ ఎంపీపీ గజభీంకార్ రాజన్న, నాయకులు కుంభాల మల్లారెడ్డి, అందె సుభాష్, గడిల సురేష్, సురేష్‌నా యక్, గడ్డం భాస్కర్, బాలయ్య పాల్గొన్నారు.