Share News

మొబైల్‌ యాప్‌లో యూరియా నమోదు చేసుకోవాలి

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:43 AM

రైతులు మొబైల్‌ యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌ సూచించారు. శుక్రవారం కోరుట్ల మున్సిపల్‌ పరిధిలో ని ఎఖీన్‌పూర్‌ గ్రామంలోని సింగిల్‌ విండో భవనంలో ఏర్పాటు చేసిన అన్‌లైన్‌ ఎరువుల నమోదుపై విండో చైర్మన్‌ నర్సరెడ్డితో కలిసి రైతులకు అవగాహన కల్పిం చారు.

మొబైల్‌ యాప్‌లో యూరియా నమోదు చేసుకోవాలి
నారుమడిని పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌

- జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌

కోరుట్ల రూరల్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రైతులు మొబైల్‌ యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌ సూచించారు. శుక్రవారం కోరుట్ల మున్సిపల్‌ పరిధిలో ని ఎఖీన్‌పూర్‌ గ్రామంలోని సింగిల్‌ విండో భవనంలో ఏర్పాటు చేసిన అన్‌లైన్‌ ఎరువుల నమోదుపై విండో చైర్మన్‌ నర్సరెడ్డితో కలిసి రైతులకు అవగాహన కల్పిం చారు. మొదట గ్రామ శివారులోని వరి నారు సాగు చేసే పద్ధతిని పరిశీలించారు. అనంతరం సింగిల్‌ విం డో భవనంలో రైతులలో ఏర్పాటు చేసిన సమా వేశం లో జిల్లా అధికారి భాస్కర్‌ మాట్లాడారు. రైతులు ఈ నెల 20 నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌ ద్వారా యూరియా నమోదు చేసుకోవాలని సూచిం చారు. యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకున్న బస్తాలను మాత్రమే డీలర్‌ అమ్మడానికి అవకాశం ఉందని తెలిపారు. రైతులు మొబైల్‌లో పట్టా నంబర్‌ నమోదు చేసి ఓటీపీ నమోదు చేసిన తర్వాత జిల్లాలో ఎక్కడైన యూరియాను పొందవచ్చునని తెలిపారు. సమా వేశంలో మండల వ్యవసాయ అధికారి నాగమణి, ఏడీఏ రమేష్‌, ఏఈవో నరేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చెర్మన్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

రాయికల్‌ (ఆంధ్రజ్యోతి): మండలంలోని అల్లీపూ ర్‌, ఇటిక్యాల, భూపతిపూర్‌, ధర్మాజీపేట గ్రామా ల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన యూరి యా బుకింగ్‌ యాప్‌పై ఏవో ముక్తీశ్వర్‌ రైతులకు అవ గాహన కల్పించారు. రైతులు తమకు అందుబాటులో ఉన్న సమీపఎరువుల షాపును ఎంపిక చేసుకుని యూరియాను బుక్‌ చేసుకునే సౌకర్యం అందుబా టులో ఉందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన రాజలింగం, ఎఫ్‌పీవో చైర్మన శంకర్‌, ఏఈవోలు సతీష్‌, సౌందర్య, నరేష్‌, పద్మావతి పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:43 AM