రైతులకు అందుబాటులో యూరియా
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:18 AM
రైతులకు అవసరమైనంత యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెంద వద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
- అధికారులతో వీడియో కాన్ఫరెన్స
సిరిసిల్ల కలెక్టరేట్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యో తి): రైతులకు అవసరమైనంత యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెంద వద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్ నుంచి యూరియా యాప్‌తోపాటు యూరియా నిల్వలపై రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావుతో కలిసి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం నుంచి 5.60 లక్షల మెట్రిక్ టన్ను లకు గాను 5.70 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్సటికే రాషా్ట్రనికి చేరుకున్నాయని వివరిం చారు. ఈ సీజనలో 3.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొను గోలు చేశారన్నారు. ఇది గత సీజన కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికం అని వెల్లడిం చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరి యా నిల్వ ఉన్నట్లు తెలిపారు. యూరియా యాప్ అనేది కేవలం రైతుల సౌకర్యార్థం తెచ్చినది మాత్రమే, దీని ద్వారా యూరియా అమ్మకాలు పారదర్శకంగా జరుగుతు న్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే కపాస్ కిసాన యాప్ ద్వారా రైతులు పత్తి అమ్మకాలు సులభంగా చేసుకోగలుగుతున్నారని, అదే దిశలో యూరియా అమ్మ కానికి యాప్‌ని తీసుకువచ్చామన్నారు. యూరియా సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల ని మంత్రి ఆదేశించారు. యూరియా స్టాక్, డిమాండ్, పంపిణీపై జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు నిశితంగా పర్యవేక్షించాలని అవసరమైతే అదనపు సేల్స్ పాయిం ట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూరియా పం పిణీపై మండల, డివిజన, జిల్లాస్థాయిలో ప్రత్యేక పర్యవే క్షణ బృందాలను నియమించాల్సిందిగా సూచించారు. యూరియా పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. యూరియా లభ్యతపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. సిరిస్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉ ద్యానశాఖ అధికారి శరతబాబు, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
- జిల్లాలో ఎరువుల కొరత లేదు
కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల కలెక్టరేట్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పం టల సాగుకు సరిపడా యూరియా నిల్వలు అందు బాటులో ఉన్నాయని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. యూరియా విషయమై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఎరువు లను రైతుల పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణం గా సరఫరా చేయాలని సంబంధిత జిల్లా అధికారుల ను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు అప్ర మత్తంగా ఉండాలని ఎరువులు పక్కదారి పట్టకుండా, ఇతర అవసరాలకు వాడకుండా చూడాలని సూచిం చారు. జిల్లాలోని అన్ని సొసైటీలు, ప్రైవ్రేట్ డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉందని సూచించా రు. జిల్లాలో యాసంగి సాగు కోసం మొత్తం 21 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి వరకు 10వేల 991 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని వెల్లడించారు.