26న అర్బన్ బ్యాంక్ మహాసభ
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:49 AM
సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ సభ్యు లకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12 శాతం డివిడెం డ్‌ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామని బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ తెలిపారు.

సిరిసిల్ల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ సభ్యు లకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12 శాతం డివిడెం డ్‌ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామని బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్‌లో 7200 మంది సభ్యులు ఉన్నా రని, 4600 మంది సభ్యులకు మాత్రమే ఖాతాలు ఉన్నాయని అన్నారు. ఖాతాలు లేని సభ్యులు సేవింగ్ ఖాతాలను తీసుకోవాలని అన్నారు. డివిడెండ్‌ను ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. సేవిం గ్ ఖతాలకు కేవైసీ చేసుకోవాలని తెలిపారు. ఇతర బ్యాంక్‌ల కంటే టర్మ్‌ల డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తున్నామని సిరిసిల్ల ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని అన్నారు. బ్యాంక్ అర్థ వార్షిక మహాసభ ఈనెల 26న 11 గంటలకు పద్మశాలీ కళ్యాణ భవనంలో నిర్వహించడం జరు గుతుందని సభ్యులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి, డైరెక్టర్లు గుడ్ల సత్యానందం, చొప్పదండి ప్రమోద్, పాటి కుమార్‌రాజు, బుర్ర రాజు, వేముల చుక్కమ్మ, అడ్డగట్ట దేవదాస్, ఎనగందుల శంకర్, వరుస హరిణి, పత్తిపాక సురేష్, కోడం సంజీవ్, బ్యాంక్ సీఈవో పత్తిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.