Share News

సనాతన ధర్మంతోనే విశ్వ కల్యాణం..

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:40 AM

సనాతన ధర్మంతోనే విశ్వ కళ్యాణం దేశహితమే సంఘ లక్ష్యమని జగిత్యాల జిల్లా సంఘచాలక్‌ ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు.

సనాతన ధర్మంతోనే విశ్వ కల్యాణం..

చందుర్తి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : సనాతన ధర్మంతోనే విశ్వ కళ్యాణం దేశహితమే సంఘ లక్ష్యమని జగిత్యాల జిల్లా సంఘచాలక్‌ ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని, శనివానం విజయదశమి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన వక్తగా జగిత్యాల జిల్లా సంఘచాలక్‌ డాక్టర్‌ ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దేశ ఉన్నతి కోసం ఎలాంటి స్వార్థం లేకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో కృషి చేస్తుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో అందరు భాగస్వాములు కావాలన్నారు. భారతదేశ హిందూ దేశమని, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలన్నారు. ప్రపంచానికి జ్ఞానాన్ని అం దించినది భారతదేశమని, అందుకే ఈ దేశాన్ని జ్ఞానభూమి అని కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూ విశ్వ గురువుగా ఉందన్నారు. భారతదేశం పుణ్యభూమి అని ఈ దేశంలో దేవతలు పుట్టి తిరిగారన్నారు. అందుకే రుగ్వేదంలో దుర్లభం భారతి జన్మ మానస తత్రుదుర్గం అని,ఈ దేశం లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమన్నారు. స్వామి వివేకానంద విశ్వమ త సభలో మాట్లాడిన తర్వాత ఈనేలపై నేరుగా పాదం మోపకుండా నేలపై పొర్లాడడం జరిగిందన్నారు. ఇలాంటి దేశం ఎందుకు బానిసత్వంలోకి వెళ్లిందని చరిత్రను పరిశోధించిన డాక్టర్‌ హెగ్డేవార్‌ ఈ దేశ ప్రజల మధ్య ఐక్యత, ఈ దేశం నాది అనే భావన లేని కారణంగానే ఈ స్థితిలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు చెన్నమనేని ఆంజనేయ రావు, మల్యాల, కట్ట లింగంపేట, లింగంపేట గ్రామ స్వయంసేవకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 12:41 AM