భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పతనం
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:26 PM
భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పతనమని, ఇది మన సంస్కృతికి నిదర్శనమని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’(జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల ‘రన్ ఫర్ యూనిటీ’ని శుక్రవారం నిర్వహించారు.
కరీంనగర్ క్రైం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పతనమని, ఇది మన సంస్కృతికి నిదర్శనమని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’(జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల ‘రన్ ఫర్ యూనిటీ’ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అవార్డు, కాళోజీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్, దాశరఽథి అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్‌ను సన్మానించారు. అనంతరం సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత కోసం పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. ‘రన్ ఫర్ యూనిటీ’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో జాతీయ ఐక్యతపై చైతన్యం పెరుగుతుందన్నారు. దాశరథి అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ... దేశంలో ఎన్నో జాతులు ఉన్నప్పటికీ భారతదేశం తత్వమే భిన్నత్వంలో ఏకత్వమని, ప్రతి ఒక్కరూ దేశసమైక్యతను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీం రావు, కమిషనరేట్‌లోని అన్ని విభాగాల పోలీసు అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.