గ్రామదేవతల పండుగలతో ప్రజల్లో ఐకమత్యం
ABN , Publish Date - May 12 , 2025 | 12:21 AM
గ్రామదేవతల పండుగలతో ప్రజల్లో ఐకమత్యం పెరుగుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని ఇల్లంతకుంట, రామోజిపేట గ్రామాల్లో జరుగుతున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆదివారం పాల్గొన్నారు.
- మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ
ఇల్లంతకుంట, మే 11 (ఆంధ్రజ్యోతి)తి: గ్రామదేవతల పండుగలతో ప్రజల్లో ఐకమత్యం పెరుగుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని ఇల్లంతకుంట, రామోజిపేట గ్రామాల్లో జరుగుతున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామదేవతలను పూజించడం అనాదిగా కొనసాగుతోందన్నారు. పెద్దమ్మతల్లి దీవేనలతో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని, గతంలో హైమాస్ట్ లైట్ అడుగగా మంజూరు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ముదిరాజ్ సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ అధికారప్రతినిధి పసుల వెంకటి, ముదిరాజ్ సంఘ అధ్యక్షులు గొడుగు నర్సయ్య, పిల్లి వెంకటి, నాయకులు ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, కూనబోయిన బాలరాజు, రేగుల కార్తీక్, దేవయ్య, సుధాకర్, ఎండ్ర బుచ్చయ్య, రఘు, కూనబోయిన వేణు, ఒగ్గు రమేష్, మాధవరెడ్డి, తీగల పుష్పలతనాగయ్య, నేరెళ్ళ విజయ్, నరేందర్‌రెడ్డి, ఉప్పునూటి రవి వివిద గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
- ఉగ్రవాద మూలాలు దేశంలో లేకుండా చూడాలి..
ఉగ్రవాద మూలాలు దేశంలో లేకుండా చూడవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలకేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు ఏమి ఇచ్చినా తీర్చలేనిదన్నారు. గతంలో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకం అన్నారు. కాల్పుల విరమణ చేయడానికి గల కారణాలను ప్రధానమంత్రి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అమెరికా ఒత్తిడికి లోనై ఈనిర్ణయం తీసుకున్నారని ప్రజల్లో చర్చ మొదలయ్యిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అందరికి న్యాయం జరుగుతుందని వివరించారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నాయకులు రమణారెడ్డి, మహేందర్‌రెడ్డి, పసుల వెంకటి, రేగల కార్తీక్, ఒగ్గు రమేష్ , మాధవరెడ్డి, విజయ్, తీగల పుష్పలత పాల్గొన్నారు.