‘పది’ ఫీజును చెల్లించిన కేంద్ర సహాయ మంత్రి
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:34 PM
మోదీ గిఫ్ట్ పేరుతో సిరి సిల్ల జిల్లాలో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండిసంజయ్‌కుమార్ చెల్లిం చారు.
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మోదీ గిఫ్ట్ పేరుతో సిరి సిల్ల జిల్లాలో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండిసంజయ్‌కుమార్ చెల్లిం చారు. తన వేతనం నుంచి చెల్లిస్తానని బండి సంజయ్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కలిసి రూ 4లక్షల 93వేల 500 చెక్కును అందించారు. సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 3948మంది పిల్లలు పదో తరగతి చదువుతున్నారని, వారందరి పరీక్ష ఫీజును చెల్లించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవా రే కావడంతో వారిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష ఫీజులు కూడా చెల్లించకలేకపోతున్నారని కేంద్ర హాం శాఖ సహాయ మంత్రి తెలుసు కుని ఈ మేరకు తన వేతనం నుంచి పరీక్షల ఫీజులు చెల్లిస్తానని జిల్లా కలెక్టర్‌కు లేఖలు రాశారన్నారు. అందులో భాగంగానే ఆయన చెక్కును పంపించడంతో తాము కలెక్టర్‌కు అందజేశామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి తెలిపారు. అంతేకాకుండా అతి త్వరలోనే మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులకు సైతం సైకిళ్లను ఇవ్వడా నికి ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరంలో మోదీ కిట్స్ పేరుతో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదువుకునే పిల్లలందరికి స్కూల్ బ్యాగ్, నోట్‌బుక్స్, జామెట్రీ బాక్స్‌లు, పెన్నులు, పెన్సిళ్లు, స్టీల్‌వాటర్ బాటిల్స్‌లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపా ధ్యక్షుడు శీలం రాజు తదితరులు పాల్గొన్నారు.