డిజిటల్ బోధనతో అవగాహన సులభం
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:11 AM
డిజిటల్ బోధనతో విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన సులభతరమవుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్‌లోని కాశ్మీర్‌గడ్డ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠ శాలలో గురువారం స్మార్ట్ డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు.
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ బోధనతో విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన సులభతరమవుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్‌లోని కాశ్మీర్‌గడ్డ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠ శాలలో గురువారం స్మార్ట్ డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు మెళకు వలతో పాఠాలను బోధించాలని సూచించారు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశా లలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. డీఈవో జనార్దన్ రావు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయిని హసీనా ఫాతిమా పాల్గొన్నారు.
తిమ్మాపూర్ : అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆటాపాటలతో కూడిన పూర్వ ప్రాథమికవిద్య బోధిస్తున్నామని, వచ్చే విద్యాసంవత్సరంలో ఆరేళ్లలోపు పిల్లలందరినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఐసీడీఎస్, కరీంనగర్‌రూరల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యకు ఉపయోగించే బోధన ఉపకరణాలను మండలంలోని ఎల్‌ఎండీ కాలనీ దుర్గాబాయి దేష్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో ప్రదర్శించారు. అనంతరం చిన్నారుల కు కలెక్టర్ సర్టిఫెకెట్లను అందజేశారు. జిల్లా సంక్షేమ అధికారి సబిత, సీడీపీవో శ్రీమతి, ప్రాంగణం మేనేజర్ సుధారాణి, డీసీపీవో పర్వీన్ పాల్గొన్నారు.