Share News

పారదర్శకంగా చెల్లింపులు..

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:06 AM

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులు ఎంపిక నుంచి మంజూరు వరకు అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు.

పారదర్శకంగా చెల్లింపులు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులు ఎంపిక నుంచి మంజూరు వరకు అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో పొరపాట్లు జరగకుండా ఏఐ టెక్నాలజీ కూడా ఉపయోగించే విధంగా యాప్‌ను అప్డేట్‌ చేస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసే సమయంలో జరిగిన పొరపాట్ల వల్ల ఆయా బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో డబ్బులు ఇతర ఖాతాల్లోకి వెళ్తున్నాయనే ఫిర్యాదులు రావడంతో గృహనిర్మాణ శాఖ అధికారులు ఆధార్‌ నంబర్లతో బిల్లు చెల్లింపు జరిగే సమయంలో లబ్ధిదారుల పేరును పరిశీలించే విధంగా చర్యలు చేపట్టారు. ఆధార్‌ నంబర్‌తో పాటు లబ్ధిదారుల పేరు, ఇంటి నంబర్‌తో సరిచూసే విధంగా మార్పులు తెచ్చారు. ఖాతాలో పొరపాటు జరిగితే ఈ-మెయిల్‌కు సమాచారం వెళ్లనుంది.

ఫ జిల్లాలో వివిధ దశల్లో 3836 ఇళ్ల నిర్మాణాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు విడతల్లో 7918 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 5332 ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోశారు. 3836 ఇళ్లు ప్రారంభించారు. ఇప్పటివరకు మూడు ఇళ్లు పూర్తిచేశారు. బేస్మెంట్‌ స్థాయిలో 2282 ఇళ్లు, గోడల స్థాయిలో 901 ఇళ్లు, స్లాబ్‌ స్థాయిలో 656 ఇళ్లు ఉన్నాయి. కోనరావుపేట, తంగళ్ళపల్లి, వీర్నపల్లి మండలాల్లో మూడు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.44.98 కోట్ల నిధులను జమ చేశారు. జిల్లాలో 70 శాతం ఇల్లు గ్రౌండింగ్‌ పూర్తి చేశారు.

ఫ బిల్లుల చెల్లింపు ఆలస్యం కాకుండా యాప్‌

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లింకులు బిల్లుల చెల్లింపులో ఆలస్యం కాకుండా అధికారులు గృహనిర్మాణ శాఖ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన నాటి నుంచి పునాది, గోడలు, స్లాబ్‌ వంటి వివిధ దశల్లో ఉన్నప్పుడు అధికారులు, సిబ్బంది ఫొటోలు తీసి మొబైల్‌ యాప్‌లో నమోదు చేయడం ద్వారా ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో లబ్ధిదారులు కూడా నేరుగా తమ ఇంటి నిర్మాణ దశలను కూడా అప్లోడ్‌ చేయవచ్చు. దీనిపై లబ్ధిదారులకు అధికారుల అవగాహన కలిపిస్తున్నారు. యాప్‌ను ముందుగా మొబైలో ఇన్‌స్టాల్‌ చేసుకుని తర్వాత లాగిన్‌లోకి వెళ్లాలి. డాష్‌ బోర్డులోకి వెళ్లి లబ్ధిదారుడి పేరు, మొబైల్‌ నంబర్‌, గ్రామం నమోదు చేయాలి. ఫొటో క్యాప్చర్‌ ఆప్షన్‌ వస్తుంది. ఇంటి నిర్మాణం దశలు అడుగుతుంది. ఆ వివరాలు నమోదు చేయాలి. తర్వాత ఫొటో తీసి అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటికి సంబంధించిన జియో కోఆర్డినేట్‌ వివరాలు చూపుతుంది. వీటికి సంబంధించిన ఫొటోలు యాప్‌లో ఉంటాయి. ఎవరైనా తప్పుడు ఫొటోలు అప్లోడ్‌ చేస్తే స్థానిక అధికారులు, సిబ్బంది పరిశీలనలో బయటపడనుంది.

జిల్ల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి..

మండలం మంజూరైనవి ముగ్గు పోసినవి నిర్మాణంలో ఉన్నవి

బోయిన్‌పల్లి 820 570 410

చందుర్తి 525 409 232

ఇల్లంతకుంట 805 559 413

గంభీరావుపేట 648 375 272

కోనరావుపేట 562 448 338

ముస్తాబాద్‌ 574 405 301

రుద్రంగి 377 206 112

సిరిసిల్ల మున్సిపాలిటీ 882 493 364

తంగళ్ళపల్లి 602 444 342

వీర్నపల్లి 259 157 95

వేములవాడ 389 227 156

వేములవాడ మున్సిపాలిటీ 484 332 261

వేములవాడ రూరల్‌ 348 285 214

ఎల్లారెడ్డిపేట 643 422 327

మొత్తం 7918 5332 3836

Updated Date - Oct 15 , 2025 | 01:07 AM