పలువురు ఉన్నతాధికారుల బదిలీ
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:59 AM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
కరీంనగర్ టౌన్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌లో పలువురు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కమిషర్‌గా విధులు నిర్వహిస్తున్న చాహత్ బాజ్‌పేయి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషర్‌గా బదిలీ అయ్యారు. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కమిషర్‌గా విధులు నిర్వహిస్తున్న అశ్విని తానాజి వాకడే అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బదిలీ అయ్యారు. అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న ప్రపుల్ దేశాయ్ కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ చేస్తూ జీఆర్‌టీ నం.779 ద్వారా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.