Share News

ఆర్థికభరోసా దిశగా...

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:58 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) మహిళలను సంఘటితం చేసి వారిలో ఆత్మస్థయి ర్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం స్వశక్తి సంఘా లను ఏర్పాటు చేసింది. అదే మాదిరిగా దివ్యాంగులు, వృద్ధులు, బాలికలతో కూడా సంఘాలు ఏర్పాటు చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారిలో మనో ధైర్యాన్ని కల్పించడంతోపాటు ఆర్థిక భరోసా కల్పించేందుకు దోహద పడుతుందని భావిస్తోంది. డీఆర్‌డీఓ అధికారులు సంఘాలు ఏర్పాటు చేయించి వారికి పొదుపు చేయడాన్ని అలవాటు చేయిస్తున్నారు.

ఆర్థికభరోసా దిశగా...

9046- కొత్తగా ఏర్పాటైన స్వశక్తి సంఘాల మహిళల సమావేశం

ఆర్థికభరోసా దిశగా...

- దివ్యాంగులు, వృద్ధులు, బాలికలకు మనోధైర్యం

- స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు

- జిల్లాలో ఇప్పటి వరకు 1350 సంఘాల ఏర్పాటు

- ఒకరికొకరు తోడుగా నిలవనున్న సంఘ సభ్యులు

- సంఘాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మహిళలను సంఘటితం చేసి వారిలో ఆత్మస్థయి ర్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం స్వశక్తి సంఘా లను ఏర్పాటు చేసింది. అదే మాదిరిగా దివ్యాంగులు, వృద్ధులు, బాలికలతో కూడా సంఘాలు ఏర్పాటు చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారిలో మనో ధైర్యాన్ని కల్పించడంతోపాటు ఆర్థిక భరోసా కల్పించేందుకు దోహద పడుతుందని భావిస్తోంది. డీఆర్‌డీఓ అధికారులు సంఘాలు ఏర్పాటు చేయించి వారికి పొదుపు చేయడాన్ని అలవాటు చేయిస్తున్నారు.

గ్రామాలు, పట్టణాల్లో ఉండే వివిధ వర్గాల మహిళలను 1995 నుంచి ఒక్కటిగా చేసి 10 నుంచి 15 మంది సభ్యులను కలిపి ఒక డ్వాక్రా గ్రూపుగా ఏర్పాటు చేయించారు. వాళ్లు క్రమం తప్పకుండా రెండేళ్ల వరకు నెలనెలా పొదుపు చేయాల్సి ఉంటుంది. ఆ సంఘాలకు ప్రభుత్వం 10 వేల రూపాయల రివాల్వింగ్‌ ఫండ్‌ను అందజేసింది. ఆ డబ్బులు, పొదుపు చేస్తున్న డబ్బులతో మహిళలు స్వయం ఉపాధి పనులు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సహించింది. ఈ పొదుపు విప్లవం అనేక మంది మహిళలను సంఘాలుగా ఏర్పాటయ్యేందుకు దోహదం చేసింది. ప్రతి గ్రామం, పట్టణంలో మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల సంఘాల పర్యవేక్షణ బాధ్యత సెర్ప్‌, పట్టణ ప్రాంతాల బాధ్యత మెప్మా చూస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 9,628 సం ఘాలు ఉండగా, వీటిలో లక్ష మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పావలా వడ్డీ రుణాలు, జీరో వడ్డీ రుణులను అందిస్తున్నారు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా కూడా రుణాలను అందజేస్తున్నారు. సంఘం ఏర్పా టుకు 18 నుంచి 60 ఏళ్ల వయసు వాళ్లే ఉండాలనే నిబంధన ఉంది. 60 ఏళ్లు నిండిన వారందరినీ సంఘం నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత ఆర్థిక భరోసా లేక చాలా మంది వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ప్రస్తుత అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం మహి ళలను కోటీశ్వరులను చేసేందుకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళలచే ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించడం, పెట్రోల్‌ బంకులు, క్యాంటీన్లు, మాల్స్‌, తదితర షాపులను ఏర్పాటు చేయిస్తున్నారు. అలాగే దివ్యాంగులు, వృద్ధులు, కిషోర బాలికలచే స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేయించేందుకు మహిళా శక్తి మిషన్‌ కార్యక్రమాన్ని తీసుకవచ్చారు. ఆయా స్వశక్తి సంఘాల్లో లేని దివ్యాంగులు, వృద్ధులు, కిషోర బాలిక లచే రెండు మాసాల నుంచి సెర్ప్‌ సిబ్బంది స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు కొత్త సంఘాలు 1350 ఏర్పాటయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో 2390 మంది సభ్యులతో 239 మహిళా సంఘాలు ఏర్పాటు కాగా, 2393 మంది సభ్యులతో దివ్యాంగులతో 319 సంఘాలను ఏర్పాటు చేశారు. 4,950 మంది సభ్యులతో 495 వయోవృద్ధుల సంఘాలు, 2970 మంది బాలికలతో 297 కిషోర బాలి కల సంఘాలను ఏర్పాటయ్యాయి. ఈ సంఘాల్లోని సభ్యులకు పౌష్టికాహారం గురించి, తల్లిదండ్రులు, గురువులు ఎలా ఉండాలి, నైతిక విలువలు, సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సంఘాల్లోని సభ్యులు నెలకు 100 రూపాయల చొప్పున పొదుపు చేస్తుండగా, ఆరు నెలల తర్వాత వారికి రివాల్వింగ్‌ ఫండ్‌ అందనున్నది. ఈ విషయమై డీఆర్‌డీవో కాళిందిని ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ దివ్యాంగులు, వయోవృద్ధులు కిషోర బాలికలు, ఇప్పటి వరకు ఏ సంఘాల్లో లేని మహిళలచే 1350 సంఘాలు ఏర్పాటు చేయించామని చెప్పారు. వారిచే పొదుపు చేయిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తు న్నామని, సామాజిక అంశాలపై చైతన్య పరుస్తున్నామని తెలిపారు.

Updated Date - Sep 25 , 2025 | 12:58 AM